2013 లో వెనుకబడిన ప్రాంతాల ప్రాతిపదికపై, వెనుకబడిన ప్రాంతమైన తెలంగాణ కోసం ప్రత్యేక రాష్ట్ర సాధన సందర్భంలో, వెనుకబడిన ఉత్తరాంధ్రకు న్యాయం కోరుతూ ఆనాడు ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ ఏర్పాటు జరిగింది. జర్నలిస్టుల హక్కుల కోసం, సంక్షేమం కోసం , లేక క్రీడల కోసo అనేక సంఘాలు ఉన్నాయి.
Ujf కేవలం సామాజిక బాధ్యతతో "ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధి" ఒకే ఒక సూత్రంతో, నిబద్ధతగా పనిచేస్తున్న ujf అక్షర సైనికులను ఒక తాటిపైకి తెచ్చి గొంతు లేని ప్రజల గొంతు గా సామాజిక బాధ్యత వైపు, మేము సైతం ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి సై అనే విధంగా పనిచేస్తుంది.
44 రోజులపాటు ఇంటిని కుటుంబ సభ్యులకు దూరంగా మండుతున్న వేసవిని సైతం లెక్కచేయకుండా దాదాపు 3,600 కిలోమీటర్లకు పైగా పాత్రికేయుల బృందం క్షేత్రస్థాయిలో అధ్యయనం కోసం చేసిన ఉత్తరాంధ్ర సమన్వయయాత్ర మీకు గుర్తుండే ఉంటుంది.
ఆగస్టు 9వ తేదీ ఆనాటి మొట్టమొదటి పార్లమెంటు సభ్యులుగా ఉన్న తిలక్ గారు ujf పతాకాన్ని ఆవిష్కరించారు.
తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా
ujf, ఉత్తరాంధ్రలోని గతంలో మూడు జిల్లాలుగా ఉన్న నేడు ఆరు జిల్లాలుగా విస్తరించిన ఉత్తరాంధ్ర ల్లో ఏకకాలంలో పాత్రికేయుల సహకారంతో సమాచార శాఖ ఇతర అధికారుల సహకారంతో జర్నలిస్టుల ujf హ్యాండ్ బుక్ 2022-23 ఆవిష్కరణ జరగబోతుంది.
9/08/2022 ఉదయం 11 గంటలకు పార్వతిపురం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లాలలో ఆవిష్కరణకు జరగడం ఎంతో సంతోషకరమైన విషయం. రాబోయే రోజుల్లో మీ అందరి సహకారంతో పాత్రికేయులు అందరూ సగర్వంగా భావించే కార్యక్రమాలను చేద్దాం.
ఎవరి రాజకియాలు, ఎవరి యూనియన్స్, సంఘాలు వారివి.
Ujf ఏ సంఘానికి, రాజకీయానికి అనుబందం కాదు.
కేవలం వర్కింగ్ జర్నలిస్ట్ ల సామాజిక బాధ్యతతో కూడిన సంస్థ.
© 2013 Uttarandhra Journalist's Front., All Rights Reserved.
site designed & Hosted by Vijay Kumar Kurra with prestigious GROOVE Platform.